నవంబర్ 15 నుంచి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు

నవంబర్ 15 నుంచి పది రోజుల పాటు సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయిబాబా పోస్టల్ స్టాంపు, రూ.100 నాణేన్ని విడుదల చేయనున్నారు.

ఈ మేరకు అఖిల భారత సత్యసాయిబాబా సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సత్యసాయిబాబా శత జయంతా వేడులకలో 185 దేశాలకు చెందిన వారు పాల్గొంటారని పేర్కొన్నారు.  సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా  జరపాలని ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.