కురుమలకు కేబినెట్ బెర్త్ డిమాండ్ తో గాంధీభవన్ ముట్టడి

హైదరాబాద్ నాంపల్లిలోని  గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 40 లక్షలకు పైగా ఉన్న యాదవ కురుమలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి గాంధీ భవన్ ను పోమవారం (జూన్ 23) ముట్టడించింది.

 గాంధీ భవన్ లోని గొర్రెలను పంపి వినూత్న రీతిలో నిరసన తెలిపింది.  ఈ నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడమే కాకుండా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు.