మొటిమలు వచ్చాయని విషం తాగిన యువతి

 

ఈమధ్య కాలంలో చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మొటిమలు వచ్చాయని ఆందోళన చెందిన ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇండోర్‌‌కి చెందిన నివసించే నిధి మాల్వియా అనే 22 సంవత్సరాల యువతికి మొటిమలు వచ్చాయి. మొటిమలు వచ్చినప్పటి నుంచీ ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతూ వుండేది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ఆమె ఆందోళన పడటం మానలేదు. ఈ ఆందోళన తీవ్రంగా పెరిగిపోయి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసింది. శనివారం రాత్రి నిధి మాల్వియా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu