చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం

 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకి అవమానం జరిగింది. ఆమె విగ్రహం ప్రతిష్టించిన ఆరు నెలలకే నేలమట్టమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే రెండు రోజుల క్రితం ఆమె విగ్రహం కొద్దిగా ఒరిగిపోయి ఉంది. బుధవారం రాత్రి చూసేసరికి నేలపై పడిపోయి ఉంది. ఎవరైనా విగ్రహాన్ని కూల్చివేశారా లేక దానంతట అదే కూలిందా అన్నది మిస్టరీగా మారింది. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu