యువరాజ్ సింగ్ సెంచరీ.. కళ్లల్లో నీళ్లు...

 

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ మరోసారి తన సత్తా చూపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆట ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన టీమ్ కు అండగా నిలిచాడు. యువరాజ్ సింగ్ కు ధోని కూడా జతకట్టి మంచి స్కోర్ ను సాధించారు. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం సాధించాడు. యువరాజ్ తన కెరీర్లో 14 వన్డే సెంచరీ సాధించగా, ఐదేళ్ల తరువాత అతనికి ఇదే తొలి సెంచరీ. ధోని వెంటనే వచ్చి యువీని అభినందించాడు. కెరీర్‌లో 14వ శతకం బాదిన యువీ కళ్లలో భావోద్వేగంతో కూడిన కన్నీళ్లు కనిపించాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu