ఏపీ, తెలంగాణ నయా వివాదం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు గులాబి రంగు..
posted on Jun 30, 2017 11:01AM
.jpg)
రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. కొత్త రాష్ట్రాలు ఏర్పడి ఇప్పటికి మూడు ఏడేళ్లు అయిపోయింది. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారం అయినా... కొన్ని మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. అదేంటంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడం. గతంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ, నీటి పంపకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య వివాదలు తలెత్తాయి. అయితే అప్పుడు అవి పరిష్కారమవ్వగా..ఇప్పుడు వాటికి ఆజ్యం పోస్తున్నట్టుగా... తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడంతో ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టు గోడలకు గులాబీ రంగులు వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మరి దీనిపై ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.