విటమిన్లు ఎందుకు ముఖ్యం?

ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది చాలా అవసరం...! ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చెయ్యగలం...! ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సమృద్ధిగా అందాలి. అంటే  పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సిందే...!

ఏమి తింటున్నాం అన్నది కాదు మనం తినే ఆహారంలో ఎంత శాతం మనకు ఆరోగ్యకరమైన పోషకాలు అందుతున్నాయి అన్నది ముఖ్యం. అందుకే ఆహారంలో పోషక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మనకు ఎ,బి,సి, డి, ఇ విటమిన్లు ఉన్నాయని తెలుసు. ముఖ్యంగా విటమిన్ 'ఎ' వలన సౌందర్యం అంటే శరీర ఆరోగ్యం అనే ముందుగా జ్ఞాపకం వస్తుంది. అంటే అందాన్ని పెంచే విటమిన్ గా విటమిన్ 'ఎ' ని వర్ణించవచ్చు. అయితే శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అందాన్ని కాపాడుకోగలం. అన్ని విటమిన్లు సమానముగా వినియోగించినప్పుడే సరిగా ఫలితాలు వుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి విటమిన్ అవసరమే. ఒక్కొక్క విటమిన్ యొక్క ఉపయోగాలు చెప్పాలంటే...

విటమిన్ 'ఎ'

 'ఎ' విటమిన్ చర్మము మీద పనిచేస్తుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలంటే విటమిన్ 'ఎ' చాలా అవసరం. విటమిన్ 'ఎ' వెంట్రుకల్ని, కంటిచూపుని సంరక్షిస్తుంది. ఇది మనకు ఆహారంలో పాలు, లివర్, కేరట్, క్యాబేజీ, ఆకుకూరలు, వెన్న, గ్రుడ్లు, టమోటా, మీగడలలో లభిస్తుంది. 

విటమిన్ 'ఎ' గల ఆహారం చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచగలుగుతుంది. చర్మ సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు విటమిన్ 'ఎ' గల ఆహారం తీసుకోవటం చాలా అవసరం. మన చర్మతత్వాన్ని బట్టి కూడా మన ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు.

విటమిన్ 'బి' 

ఇది ఎనిమిది విటమిన్ల సంయోగము. ఇది శరీరంలో నెర్వస్ సిస్టమ్ను బలపరుస్తుంది. అంతే కాదు ఆ సిస్టంను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మీకు ఆరోగ్యానికి అందమైన చర్మానికి విటమిన్ 'బి' కలిగిన ఆహారం అవసరం. 

విటమిన్ బి లభించే పదార్థాలు కొన్ని చెప్పుకుంటే వాటిలో ధాన్యము, లివర్, ఆకుకూరలు, పచ్చిగుడ్ల సొన మొదలయినవి.

విటమిన్ 'సి' 

శరీరంలో టిష్యూలను బలంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. విటమిన్ 'సి' పళ్ళ చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీన్ని నిమ్మజాతి పళ్ళ నుండి పొందగలం. విటమిన్ సి అధికంగా గల ఆహారం తీసుకోవటం అవసరం. విటమిన్ 'సి' పండ్లలో, టమోటా, లివర్, క్యాబేజి, ఎర్రమిరపకాయ, కాలీఫ్లవర్, స్ట్రాబెర్రీ పండ్లలో లభిస్తుంది. ఇది ఇమ్యూనిటిని బాగా పెంచడంలో తోడ్పడుతుంది.

విటమిన్ 'డి' 

మీ దంతములు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ 'డి' వాడాలి. దీనివలన దంతములు, ఎముకల మూలములు గట్టిబడి ఆరోగ్యవంతంగా ఉంచగలవు. అట్లాగే పిల్లల ఎముకలు దృఢంగా పెరగాలంటే విటమిన్ 'డి' చాలా అవసరం. విటమిన్ 'డి' లభించే పదార్థాలను చూస్తే వాటిలో చేపలో, గ్రుడ్లలో, మీగడలో, కాడ్వర్ ఆయిల్ మొదలైనవాటిలో  'డి' విటమిన్ లభిస్తుంది. అట్లాగే సూర్యరశ్మిలో 'డి' విటమిన్ అధికంగా ఉంటుంది. అందుకే రోజులో కొద్దిసేపు లేత సూర్యకిరణాలు శరీరం మీద పడేలా ఉండాలని చెబుతారు.

విటమిన్ 'ఇ'

 విటమిన్ 'ఇ' రక్తప్రసారాన్ని శరీరంలో సక్రమంగా ఉండేలా చూస్తుంది. విటమిన్ 'ఇ' ఎక్కువగా క్యారెట్, క్యాబేజి, ఆలివ్, రొట్టె, తాజాకూరలు, జీడిపప్పు మొదలైన వాటిలో లభిస్తుంది.

ఈ విధంగా ఎ, బి, సి, డి, ఇ మొదలైన విటమిన్ గల ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు.

                                ◆నిశ్శబ్ద.