కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు ఎంపిక చేసిన 12 హాస్పిటల్స్

హైదరాబాద్ లో నిమ్స్, విశాఖలో కేజీహెచ్
ఆగష్టు 15నాటికి అందుబాటులోకి రావాలన్న ఐసీఎంఆర్

కోవిడ్ 19 వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సిన్ తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్ఖలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎవీ సత్పలితాలను ఇవ్వలేక పోయాయి. మన దేశంలోని భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్ లాబ్ లో సత్పలితాలను ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)  అనుమతి ఇచ్చింది. మనుషులపై చేసే ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్ట్‌ 15 నాటికి ఈ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం కోసం దేశ వ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లను ఎంపిక చేశారు. 
ఇందులో హైదరాబాద్ లో నిమ్స్, విశాఖలో కేజీహెచ్ హాస్పిటల్స్ ఉన్నాయి.
భూవనేశ్వర్ లోని IMS, SUM హాస్పిటల్ తో పాటు  న్యూ ఢిల్లీ, పాట్నా, బెల్గాం (కర్ణాటక), నాగ్పూర్, గోరఖ్పూర్, కట్టంకులతుర్ (తమిళనాడు), ఆర్య నగర్, కాన్పూర్ ( ఉత్తర ప్రదేశ్) గోవాలోని హాస్పిటల్స్ కు అనుమతి ఇచ్చారు.