కల్లును సేవించిన మిస్ వరల్డ్-2025 పోటీదారులు

 

హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలను సీఎం రేవంత్‌రెడ్డిచేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు. 

ఈ నెలాఖరు వరకు జరిగే అందల పోటీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. అయితే ఈ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ అందగత్తెలు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్లు  తాగారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే ఈ నీరా కల్లు సేవించి... చాలా ఎంజాయ్ చేశారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu