దిల్ కుష వద్ద మీడియా హడావిడి

హైదరాబాద్: రాజధానికి తమ తమ పనుల నిమిత్తం వచ్చే ప్రముఖులు దిల్ కుష అతిథి గృహంలో సేద తీరుతారు. అయితే ఇటీవల అలా సేదతీరుదామనుకుంటున్న ప్రముఖులకు విశ్రాంతి కరవైందట. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కేసును సిబిఐ దిల్ కుష గృహం కేంద్రంగా దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. సిబిఐ వద్దకు వచ్చి వెళ్లి పోయే వారి కోసం మీడియా హడావుడి చేస్తోంది. అయితే వచ్చిన వారు అతిథి గృహానికి వచ్చారా లేక సిబిఐ వద్దకు వచ్చారా అనే విషయం పూర్తిగా తెలుసుకోకుండానే కొందరు హడావుడి చేస్తున్నారట. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు అతిథి గృహానికి వచ్చారు. గాలి గనుల కేసు విచారణ కోసం సిబిఐ పిలిపించిందని భావించిన మీడియా ఆయన పేరును ప్రసారం చేయడంతో ఆయన తర్వాత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో దిల్ కుష అతిథి గృహం అంటేనే ప్రముఖులు హడలెత్తే పరిస్థితి ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu