నాఫై చేస్తున్నఆరోపణలు అర్ధరహిటతం: బాబు
posted on Nov 10, 2011 9:10AM
ఖమ్మం
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైతు పోరు బాటలో భాగంగా ఆయన బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. తమపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఆయన అన్నారు.తెలంగాణపై మాట్లాడేందుకు నిరాకరించారు. రైతు సమస్యలపై తాము కార్యాచరణ ప్రణాళికను రచిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి చూపిస్తానని ఆయన అన్నారు. ఆయన వేంసూరు మండలంలోని కరువు ప్రాంతాలను పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అక్కడి నుంచి పంటలను పరిశీలిస్తూ దుద్దేవూడి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కందుకూరు వరకు ఆయన పాదయాత్ర చేశారు. కరువు ఎక్కడుందని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఖమ్మం జిల్లాలో కరువు కనిపించలేదా అని అడిగారు. ఏసి గదులను వదిలి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని ఆయన అన్నారు.