వర్షాకాలంలో పెరుగు సరిగా తోడు కావడం లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!
posted on Jul 8, 2025 9:30AM
.webp)
వర్షాకాలంలో గాలిలోని చల్లదనం హాయిని, విశ్రాంతిని కలిగిస్తుంది. అందుకే చాలామందికి వర్షాకాలం అంటే బాగా ఇష్టం ఉంటుంది. కానీ దీని కారణంగా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంట్లో పెరుగు సరిగా తోడు కాకపోవడం. చలికాలంలో జరిగేది ఏంటంటే.. పెరుగు తొందరగా తోడు కాకపోవడం ఒకటైతే.. పెరుగు బాగా క్రీమ్ లాగా కాకపోవడం మరొకటి. కాలాన్ని బట్టి అన్ని మారుతున్నట్టే ఈ ప్రక్రియలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది. అయితే ఈ చలికాలంలో పెరుగు బాగా తోడు కావాలన్నా, క్రీమ్ గా గడ్డ పెరుగు రావాలన్నా ఈ కింది చిట్కాలు గమనించి వాటిని ఫాలో అవ్వాలి.
ఉష్ణోగ్రత..
పెరుగు చిక్కగా రావాలంటే పాల ఉష్ణోగ్రత చాలా ముఖ్యం. కొంతమంది పాలను వేడి చేసి అలా వదిలేసి ఉష్టోగ్రత చెక్ చేయకుండా తోడు పెడుతుంటారు. వాతావరణం కారణంగా పాలు తొందరగా చల్లగా అవుతాయి. అందుకే పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
పాత్ర..
పెరుగు తోడు పెట్టాలి అనుకునే పాత్ర శుభ్రంగా ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే.. పాలు కాచిన గిన్నెలో అట్లాగే కాసింత పెరుగు వేసేస్తుంటారు. ఇది పెరుగు అదొక రకమైన వాసన, పెరుగు రుచి మారడానికి కారణం అవుతుంది. శుభ్రంగా, పొడిగా ఉన్న గిన్నెలో పాలు వేసి అందులో తోడు పెడితే పెరుగు బాగా అవుతుంది.
పెరుగు కంటెంటే..
పాలు తోడు పెట్టడానికి పెరుగును జోడించడం మామూలే. అయితే చలికాలంలో వాతావరణం కారణంగా కేవలం కొద్దిగా పెరుగు వేస్తే అది తోడు కావడం చాలా ఆలస్యం అవుతుంది. పుల్లగా లేకుండా ఫ్రెష్ గా ఉన్న పెరుగును వినియోగించాలి. ఒక లీటరు పాలకు ఒకటి నుండి రెండు స్పూన్ల తాజా పెరుగుతో తోడు పెడితే పెరుగు చాలా బాగా తోడవుతుంది.
ఒక చిట్కా..
పెరుగును పాలలో ఒక చెంచా మొత్తంలో వేసి అలా మూత పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేస్తే పెరుగు తోడు కావడం లేటవుతుంది. అలా కాకుండా పెరుగును పాలలో వేయగానే పాలు మొత్తం బాగా కలపాలి. ఇలా చేస్తే పెరుగు చక్కగా సమంగా తయారవుతుంది.
ప్రదేశం..
పెరుగు బాగా తోడు కావాలి అంటే ఇంట్లో స్థిరమైన, కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో పాల గిన్నెను ఉంచాలి. దీని వల్ల పెరుగు బాగా తోడవుతుంది. చల్లని ప్రదేశంలో ఉంచితే పెరుగు తొందరగా తోడు కాదు.
*రూపశ్రీ.