హైకోర్టు విభజనకు ఆంధ్రా ప్రభుత్వం ఒకే
posted on Apr 1, 2015 9:51AM
.jpg)
హైకోర్టు విభజనపై దాఖలయిన ఒక పిటిషనుపై నిన్న హైకోర్టులో తెలంగాణా ప్రభుత్వ వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు జరుగుతాయి. విభజన చట్ట ప్రకారం తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం చట్ట విరుద్దం అవుతుంది కనుక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆంద్రప్రదేశ్ హైకోర్టు కోసం అవసరమయిన భవనాలు, మౌలికవసతులు కల్పించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరంలేదని కోర్టుకి తెలియజేసింది. ఆంద్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు నిర్మాణం పూర్తయ్యేవరకు హైదరాబాద్ లో తమకు కేటాయించబడిన భవనంలోనే కొనసాగేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. హైకోర్టు విభజనకు రెండు రాష్ట్రాలు సంసిద్దత వ్యక్తం చేసాయి కనుక హైకోర్టు ధర్మాసనం కూడా ఇక ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చునని భావించవచ్చును.