62 మంది పసికందుల మృతి

 

యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల కారణంగా గత వారం రోజుల్లో 62 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, మరో 30 మంది పిల్లలు గాయపడ్డారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ యునిసెఫ్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా యెమెన్లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘యెమెన్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా విద్య, ఆరోగ్య సంస్థల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు బాంబు దాడుల భయంతో వణికిపోతున్నారు. దాడులు, ఆహార లేమి, భయాందోళనల కారణంగా 62 మంది పసికందులు మరణించారు. 30 మంది చిన్నారులు గాయపడ్డారు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu