ఈ ప్రేమికులకు ఏమైంది?

 

కొంతమంది ప్రేమికులు తమ ప్రేమ సఫలం కావడం లేదని ఆత్మహత్యలకు పాల్పడటం ఇప్పుడు తరచుగా జరుగుతోంది. బుధవారం తెల్లవారుఝామున ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఒక ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వీరిని సమీపంలోని పడాలపల్లి గ్రామానికి చెందిన నాగేష్ కుమార్ (23), మౌనిక (20)గా గుర్తించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల మౌనికకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఈ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఇద్దరి కుటుంబాల వారు ఘటనా స్థలానికి చేరుకుని విలపిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu