హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం... పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  సోదరుడు 

హైదరాబాద్ లో డ్రగ్స్  కలకలం  మరో మారు రేపాయి.    రాజేంద్రనగర్ సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. నార్కోటిక్స్ విభాగం, ఎస్ఓటీ విభాగం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న నలుగురు పట్టుబడ్డారు. వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారంతా నైజీరియన్లు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్టు నిందితుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu