తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్
posted on Jul 21, 2025 9:40AM
.webp)
తెలంగాణ వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న రెండు రోజులూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు దక్షిణ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంద్ర వరకు ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావవాతావరణ శాఖ సోమ, మంగళ, బుధవారాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోచ్చరించింది.
రాష్ట్రంలోని 12 జిల్లాలకు వాతావరణ ల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.