సంక్రాంతి స్పెషల్ పొంగల్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

వసంత ఋతువులో వచ్చే  మొదటి పండుగ పంట పండుగ లేదా సంక్రాంతి పండుగ. దక్షిణ భారతదేశంలో ఇదో పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ ప్రాంతాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పండుగ ఆహారంగా సంప్రదాయ పొంగల్‌ను తయారు చేస్తారు.ఇక్కడ మనం రెండు రకాల పొంగల్‌లను చూడవచ్చు. ఒకటి తీపి పొంగల్, మరొకటి స్పైసీ వెన్న పొంగల్. ఆరోగ్యం విషయానికి వస్తే పండుగల సమయంలోనే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారుచేసుకుని ఆనందించవచ్చు. దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

పొంగల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్.. మన శరీరం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మన కడుపుని  నిండుగా ఉంచుతుంది.తొందరగా ఆకలి వేయదు. అంతే కాదు, మలబద్ధకం, అజీర్ణంతో బాధపడేవారికి ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. మెరుగైన జీర్ణ శక్తిని అందిస్తుంది. స్పైసీ పొంగల్ అల్లం, మిరపకాయలతో తయారు చేస్తారు. దీంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.  

వెన్న పొంగల్:

వెన్న పొంగల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. బదులుగా అది నియంత్రణ అవుతుంది. ఇందులో వాడే చాలా ఆహార పదార్థాలు ఆరోగ్యకరం. కాబట్టి అవి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అందిస్తాయి.

వికారం సమస్యను దూరం చేస్తుంది:

పొంగల్‌లో అల్లం, మిరియాలు ఉపయోగిస్తారు. అందువలన అల్లం అజీర్ణం, వికారం సమస్యను తొలగిస్తుంది. ఇది ఉదయాన్నే ఆరోగ్య రుగ్మతల వల్ల వచ్చే వికారం, వాంతుల సమస్యను తొలగిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి:

పండుగ సమయంలో వెన్న పొంగల్ ను తయారు చేసినప్పుడు...అది  మీ శరీరానికి అవసరమైన  యాంటీ-ఆక్సిడెంట్లను అందిస్తుంది. అదనంగా, ఇది అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే గుణంతోపాటు జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేసి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

పోషకాలు పుష్కలంగా ఉంటాయి:

అపారమైన పోషకాలను కలిగి ఉన్న సాంప్రదాయ వంటలలో వెన్న పొంగల్ ఒకటి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, ఫైబర్,  క్లోరోఫిల్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగలో వెన్న పొంగల్‌ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News