మెంతులు, సొంపు వాటర్.. ఇది చేసే మ్యాజిక్ తెలిస్తే షాకవుతారు..!

 

వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు,  సోంపు ముఖ్యమైనవి.  మెంతులు ఆహార పదార్థాలకు మంచి సువాసనను ఇస్తాయి. ఇక సొంపు మసాలా వంటల్లో ఉపయోగించడమే కాకుండా భోజనం తరువాత కాసింత నోట్లో వేసుకుంటూ ఉంటారు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చెబుతారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్ తో తయారు చేసే వాటర్ మాత్రం చాలా అద్భుతాలు చేస్తుంది. ఈ మెంతి, సొంపు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

మెంతులు,  సోంపు నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల కొవ్వును కరిగించి క్రమంగా బరువు తగ్గుతారు.

జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది..

ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్,  అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  కడుపును తేలికగా ఉంచుతుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది..

మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.  సోంపు గింజలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది..

మహిళలకు మెంతులు,  సోంపు నీరు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఋతు క్రమం సరిగా లేకపోవడాన్ని  సరి చేస్తుంది. అలాగే నెలసరి సమయంలో వచ్చే  నొప్పిని తగ్గిస్తుంది.

చర్మం,  జుట్టుకు ప్రయోజనకరమైనది..

మెంతులు,  సొంపు  నీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.  జుట్టును బలోపేతం చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

సోంపు,  మెంతులు రెండూ యాంటీ బాక్టీరియల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  వ్యాధుల నుండి రక్షిస్తాయి.

ఎలా తయారు చేయాలంటే..

ఒక టీస్పూన్ మెంతులు,  ఒక టీస్పూన్ సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం నీటిని కొద్దిగా వేడి చేసి వడకట్టి, ఖాళీ కడుపుతో నెమ్మదిగా త్రాగాలి.


                                         *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu