తెలంగాణ బడ్జెట్ 2023-24.. వ్యవసాయం, ఇరిగేషన్ కు పెద్ద పీట

ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను   ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశట్టారు. మొత్తం రూ.2,90,395 కోట్లతో హరీష్ రావు   బడ్జెట్ రూపొందించారు. రూ. ఇందులో రెవెన్యూ వ్య‌యం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబ‌డి వ్య‌యం రూ. 37,525 కోట్లు. తన బడ్జెట్ లో హరీష్ రావు వ్యవసాయానికి సింహభాగం కేటాయించారు.

వ్యవసాయ రంగానికిఆయన 26,931 కోట్ల రూపాయలు కేటాయించగా, నీటి పారుదల శాకకు 26,886 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే విద్యుత్ రంగానికి 12,727 కోట్లరూపాయలు. ఆసరా పెన్షన్ల కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక దళిత బంధు కోసం 17, 700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిథి కోసం 36, 750 కోట్ల రూపాయలూ కేటాయించారు. ఇక ఎస్టీ ప్రత్యేక నిథికోసం 15, 233 కోట్ల రూపాయలు కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం6,229 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 2, 131 కోట్లు కేటాయించారు. ఇక వివిధ అంశాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.  

ఫారెస్ట్‌ కాలేజీకి రూ. 100 కోట్లు,  కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కు రూ. 200 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్లకు రూ. 400 కోట్లు,  ఆలయాల కోసం రూ. 250 కోట్లు,  మిషన్‌ భగీరథకు రూ. 600 కోట్లు మిషన్ భగీరథ అర్భన్‌ రూ. 900 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ. 1500 కోట్లు, ఎప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ కోసం రూ. 362 కోట్లు, ఆరోగ్య శ్రీ కోసం రూ. 1,101 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు కేటాయించారు. అలాగే  సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు కేటాయించిన హరీష్ రావు  యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు, టీఎస్ ఆర్టీసీ   అభివృద్ధికి రూ. 1500 కోట్లు
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించారు. ఇక  మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు కేటాయించారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖకు భారీగా 31, 426 కోట్ల రూపాయలు కేటాయించారు.  ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కార్ఫస్ ఫండ్ కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ. 3,210 కోట్లు కేటాయించగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కోసం 12,000 కోట్లు  కేటాయించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu