వైకుంటపురం ఆలయ హుండీలో రద్దైన నోట్లు
posted on Jul 9, 2025 8:51PM

గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ. 1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది.
గత జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి. కాగా బుధవారం హుండీ, మ్రొక్కుబడుల లెక్కింపు చేపట్టగా 113 రోజుల కాలపరిమితికి గాను స్వామి వారికి భక్తుల నుండి కానుకుల రూపంలో 46 లక్షల 76 వేల, 204 రూపాయల నగదు, 19 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 319 గ్రాముల వెండి కానుకల రూపంలో లభించాయి.