అగస్తేశ్వర స్వామి ఆలయంలో చోరీ
posted on Jul 9, 2025 8:43PM

గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయ వద్దకు వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉందని, లోపలికి వెళ్లి చూడగా హుండీ కూడా పగలగొట్టి అందులో ఉన్న సొమ్మును దొంగిలించినట్లు గమనించడం జరిగిందనీ అన్నారు.
ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేయగా ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ ,గుమస్తా వచ్చి చోరీ జరిగినప్పుడు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. శివాలయంలో గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని, సుమారు 15 నుండి 21వేల వరకు సొమ్ము పోయి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.