దేవుళ్లకూ తప్పని జీఎస్టీ ఎఫెక్ట్..
posted on Jul 1, 2017 1:09PM

ఒకే దేశం.. ఒకే పన్ను విధానం ఉండాలన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం గతరాత్రి నుండే అమల్లోకి తీసుకొచ్చింది. ఇక గత కొద్ది రోజుల నుండి ఈ జీఎస్టీ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకు వచ్చేలాభాలు ఏంటి..? నష్టాలు ఏంటి..? దీని ప్రభావం ఎలా ఉంటుంది..? దేని ధరలు పెరుగుతాయి..? దేని ధరలు తగ్గుతాయి..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. వాటికి ఎన్నో సమాధానాలు. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు.. దేవుళ్లపై కూడా పడింది. ఏపీలోని 179 ఆలయాలు జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండే ఆలయాలు జీఎస్టీలో నమోదు చేసుకోవాలని వాణిజ్య పన్నుల అధికారులు ఇటీవలే పలు ఆలయాల ఈవోలకు లేఖలు రాశారు. ఏపీ మొత్తం మీద 23,834 ఆలయాలు ఉన్నాయి. వీటిలో రూ. 20 లక్షల ఆదాయం దాటే ఆలయాలు 179 ఉన్నాయి.