భద్రాచలం వద్ద వరద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
posted on Aug 20, 2025 12:16PM
.webp)
గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వానలతో గోదవరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతోభద్రాచలం వద్ద గోదావరి రౌద్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీరు కలిసి గోదవరిలో ప్రవాహ ఉధృతి భారీగా పెరిగింది.
దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి. పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం నీట మునిగాయి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకువిడుదల చేస్తున్నారు.