ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాథాకృష్ణన్ నామినేషన్

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున బరిలోకి దిగుతున్న సీపీ రాధాకృష్ణన్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు.  తన నామినేషన్ పత్రాలను   రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడీకి అందజేశారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీకి నామినేషన్ పత్రాల దాఖలుకు గురువారం (ఆగస్టు 21) తుది గడువు. ఈ నేపథ్యంలోనే తుది గడువుకు ఒక రోజు ముందుగానే రాథాకృష్ణన్ తన నామినేషన్ దాఖలు చేయగా, ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన నామినేషన్ ను గురువారం (ఆగస్టు 21)న దాఖలు చేయనున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu