మంత్రులు గంటా, ఎరాసు రాజీనామా
posted on Sep 2, 2013 2:35PM

రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎరాసు ప్రతాపరెడ్డిలు తమ పదవులను రాజీనామా చేశారు. తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడే తాము రాజీనామాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చామని, నెల రోజులు పూర్తయినా రాజీనామాలు ఆమోదించకపోవడంతో ముఖ్యమంత్రిని, గవర్నర్ ను కలిసినట్లు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డిలు తెలిపారు. గవర్నర్ కు ప్రత్యేకంగా మళ్లీ రాజీనామాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి తమను తొందరపడవద్దని చెప్పారని, ఢిల్లీ వెళ్లి వచ్చాక నిర్ణయం అందరం కలిసి తీసుకుందామని అన్నారని తెలిపారు. ఇక గవర్నర్ తాను ముఖ్యమంత్రి సూచనమేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, అయితే మరో రెండు రోజుల పాటు ఆగడానికి ఇబ్బంది లేదని, అప్పటికి ఆమోదించకుంటే తాము మళ్లీ గవర్నర్ ను కలిసి ఆమోదం కోసం పట్టుబడతామని, ఒక ప్రాంతానికి మంత్రులుగా పనిచేయలేమని అన్నారు. కాగా మరో ఇద్దరు మంత్రులు విశ్వరూప్, కాసు కృష్ణారెడ్డిలు కూడా రాజీనామా చేస్తారని భావించినా, వారు రాలేదు