లోక్ సభలో 9మంది ఎంపీల సస్పెండ్
posted on Sep 2, 2013 2:19PM
.jpg)
లోక్ సభ నుండి సీమాంధ్ర ఎంపీలను మరో సారి సస్పెండ్ చేశారు. ఇంతకుముందు 12 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ గడువు ముగియడంతో లోక్ సభకు హాజరయిన ఎంపీలు ఈ రోజు మళ్లీ సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సభ నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తుండడంతో ఈ రోజు 9 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు ఆరుగురు, టీడీపీ ఎంపీలు ముగ్గురు సస్పెండ్ అయ్యారు.
సస్పెండయిన వారిలో కాంగ్రెస్ ఎమ్.పిలు అనంత వెంకట్రామిరెడ్డి,సాయిప్రతాప్, లగడపాటి రాజగపాల్, బాపిరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, టిడిపి ఎమ్.పిలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణలు ఉన్నారు. రాష్ట్రాన్ని విడదీయ వద్దని, ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.