కెవ్... కోసేసింది...
posted on May 16, 2015 11:44PM

ఒక్కోసారి ‘అలాంటి’ మగాళ్ళకు ‘ఇలాంటి’ శిక్ష న్యాయమే అనిపిస్తూ వుంటుంది. ఆమె కూడా ఇది న్యాయమే అనుకుందేమో... నిర్దాక్షిణ్యంగా ‘కోసేసింది’. అయితే ఈ కేసులో ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆ కోసేసిన మహిళకి, ‘కోత’కి గురైన అతనికి గతంలో ‘అది’ వుండేది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో నివసించే ఒక వ్యక్తికి, తన గ్రామానికి చెందిన మరో మహిళతో చాలాకాలంగా వివాహేతర సంబంధం వుంది. అయితే ఈ ఇద్దరికీ ఎందుకోగానీ ఈ మధ్యకాలంలో చెడింది. నువ్వు నా జోలికి రావద్దు అని ఆమె అతనికి చెప్పింది. అయితే అతను తమ మధ్య వున్న సంబంధాన్ని కొనసాగించాల్సిందేనని ఆమె మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె పూర్తిగా విసిగిపోయింది. అతన్ని అదుపు చేయాలంటే ‘కోసేయడమే’ ఏకైక మార్గం అనుకుంది.ఈ బృహత్ కార్యక్రమానికి ఇరుగుపొరుగు వారు కూడా ఆమెకు తమవంతు సహకారం అందించారు. శనివారం నాడు అతను ఆమె ఇంటికి వచ్చి తనతో సంబంధాన్ని కొనసాగించాలని పాత పాటే పాడాడు. అతను రావడం కోసమే కాసుక్కూర్చుని వున్న ఇరుగుపొరుగువారు అతన్ని గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు ఆ వీరనారి ఇంట్లో వున్న తుప్పుపట్టిన కత్తితో... దేవుడా... ఇక చెప్పలేం... అదన్నమాట. ఏదో జరుగుతుందని వస్తే మరేదో జరిగేసరికి ఆ వ్యక్తి కెవ్వుమన్నాడు. కిందపడి గిలగిలలాడాడు. అప్పటి వరకూ అతన్ని ఒడిసి పట్టుకుని, ‘కోత’కు సహకరించిన ఇరుగుపొరుగు వారు మానవతా ధర్మంగా అతన్ని గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల్లో వున్నాడు.