150 కోట్ల భారీ ప్రయోగం

 

 

geetha krishna director, geetha krishna koffi bar, Geetha Krishna is now in 'Coffee Bar'

 

 

గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌..

 

 ఇటీవల కాఫీబార్‌ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీతాకృష్ణ ఇంతవరకు వెల్‌నోన్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో మాత్రం స్థానం సంపాదించలేక పోయాడు.. కాని ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం గీతాకృష్ణ మంచి అభిరుచి గల దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు..



        సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌కి దూరంగా భిన్నమైన కథలతో ఆర్టిస్టిక్‌ సినిమాలను తెరకెక్కించే గీతాకృష్ణ, త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు.. అది కూడా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో.. సౌత్‌ ఇండియాలోనే ఫస్ట్‌ టైం ఇంత పెద్ద మొత్తంతో ఓ ప్రాజెక్ట్‌ తెరకెక్కించబోతున్నారు.

.

        అయితే గీతా కృష్ణ తెరకెక్కించే ఈ ప్రాజెక్ట్‌ సినిమా కాదట.. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ గ్రాడ్యుయేట్‌ అయిన గీతాకృష్ణ.. భారతీయ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, రాజకీయాలు, ఇతర విశేషాల నేపథ్యంలో ఓ డాక్యమెంటరీని తెరకెక్కిస్తున్నారు.. దీని కోసం ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షూటింగ్‌ చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు..



        మై కంట్రీ ఇండియా టైం క్యాప్సుల్‌ పేరుతో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ ఫ్యూచర్‌ ఫిల్మ్‌ను తొమ్మిది భాగాలుగా విడుదల చేయనున్నారట.. అయితే పూర్తి భారతదేశ విశేషాలతో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ డాక్యుమెంటరీ ధర 9,999 రూపాయలుగా నిర్మించారు నిర్మాతలు.. ఈ ధర కాస్త ఎక్కువగా అనిపించినా పూర్తి ప్రాజెక్ట్‌ ఖర్చు 150 కోట్లు దాటుతుండటంతో ఆ మాత్రం ధర తప్పదంటున్నారు.. మరి సినిమాలతో పెద్దగా సక్సెస్‌లు అందుకోలేకపోయిన గీతాకృష్ణ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఎలాంటి రిజల్ట్స్‌ సాదిస్తాడో చూడాలి..

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu