పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.
'కిస్' అంటే 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. ప్రతిదాన్ని సరదాగా తీసుకునే యువకుడి పాత్రలో అడివి శేష్ కనిపించనున్నారు. తాను చేసిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని శేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమాతో మరో హాట్ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. 'మిస్ కెనడా ఫోటోజెనిక్'గా పేరుబడిన ప్రియా బెనర్జీ నీ 'కిస్' తో టాలీవుడ్ పరిచయం చేస్తున్నాడు శేష్. ఆన్ స్క్రీన్ పై ప్రియా, శేష్ ల కెమిస్ట్రీ హాట్ గా ఉందని అప్పుడే వార్తలు కూడా వస్తున్నాయి. 'కిస్' తో ప్రియా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకోవడం ఖాయమని అంటున్నారు.