మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఇక లేరు
posted on Jan 27, 2025 8:44AM

మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా జీర్ణకోశ సంబధింత ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజకీయాలలోకి రాకముందు ఆర్. సత్యనారాయణ జర్నలిస్టు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2007లో కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కేసీఆర్ పిలుపు మేరకు 2008లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
ఉద్యమంలో చురుకుగా పని చేసిన సత్యనారాయణ టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా పలు పదవులను నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీచేసిన సమయంలో సత్యనారాయణ ఎలక్షన్ ఏజెంట్‌గా పనిచేశాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా ఆయన ఎన్నికల ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.
అలాగే జర్నలిస్టుగా ఆయన తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు. వ్యక్తిగతంగా మంచితనం కలిగి ఉండడం,మంచి చేయడానికి నలుగురినీ కూడగట్టడం ఆర్.సత్యనారాయణ నైజం. జర్నలిస్టుగా ఆయన అదే ఒరవడి కొనసాగించారు. ఉమ్మడి మెదక్ జిల్లా జర్నలిస్టులనందరినీ ఏకతాటిపై నడిపించారు. ఆయన మృతి తీరని లోటని పలువురు సీనియర్ జర్నలిస్టులు, పలు పార్టీల రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆర్.సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపార బీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు సత్యనారాయణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు సత్యన్నారాయణ పార్ధివ దేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.