హుస్సేన్ సాగర్ లో పడవలు దగ్ధం.. మహా హారతి సందర్భంగా అపశ్రుతి

హుస్సేన్ సాగర్ లో రెండు పడవలు దగ్ధమయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గణతంత్ర దినోత్సవం సందంర్భంగా హుస్సేన్ సాగర్ లో భారతమాత ఫౌండేష్ ఆధ్వర్యంలో ఏటా మహాహారతి నిర్వహించడం రివాజు. ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా నక్సెస్ రోడ్ సమీపంలో హుస్సేన్ సాగర్ లో మహాహారతి నిర్వహించేందుకు భారతమాత ఫౌండేష్ ఏర్పాట్లు చేసింది. మహా హారతి అనంతరం బాణ సంచా పేల్చే కార్యక్రమం కోసం రెండు బోట్లలో బాణ సంచాను ఉంచారు. అయితే ఈ రెండింటిలో ఒక బోటులో అగ్ని ప్రమాదం సంభవించి అందులో ఉంచిన బాణ సంచాకు నిప్పంటుకుంది.  అవి పేలడంతో రెండో బోటుకు కూడా మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న బాణసంచ కు నిప్పంటుకుంది. రెండు బోట్లూ పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో బోట్లలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కాగా పేలుడుకు ముందు జరిగిన మహా హారతి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  వారు అక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu