కేసీఆర్ స్వార్థపరుడు.. గువ్వల బాలరాజు

 మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడిచిందో లేదో.. తాను ఇంత కాలం ఉన్న పార్టీపై, ఆ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను స్వార్థజీవిగా అభివర్ణించారు.  కేసీఆర్ స్వార్థానికి తాను బలయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి కేసీఆర్ అసమర్ధ నాయకత్వమే కారణమని దుయ్యబట్టారు.  కేసీఆర్ ఎక్కడికక్కడ రాజీపడి పార్టీ భవిష్యత్ ను, తన వంటి నాయకుల రాజకీయ భవిష్యత్ ను నాశనం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  

తాను అమ్ముడుపోయానని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారనీ, అయితే అది పూర్తి అవాస్తవమని గువ్వల బాలరాజు అన్నారు. ఈ గువ్వల బాలరాజు ఒకరి మోచేతి నీళ్లు తాగే రకం కాదన్నారు. తాను వంద కోట్లకు అమ్ముడు పోయానంటున్న వారు ఆధారాలు చూపి నిరూపిస్తే ముక్కు నులకు రాస్తాననీ, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని సవాల్ చేశారు. 

తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ మీద  గౌరవంతోనే బీఆర్ఎస్ లో చేరాన్న గువ్వల.. కేసీఆర్ స్వార్థజీవిగా మారడంతోనే ఆయనను వదిలేశానని చెప్పారు.   గత ఎన్నికల్లో తనను మాయ చేసి టికెట్ అమ్ముకున్నారనీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా విపక్ష నేతగా కేసీఆర్ తన పాత్రను సమర్ధంగా పోషించడం లేదనీ, ఫామ్ హౌస్ కే పరిమితమై పార్టీని గాలికొదిలేశారన్నారు.  ప్రజల తరఫున గళమెత్తాలనే బీఆర్ఎస్ నుంచి వైదొలిగాన్న గువ్వల.. తాను ఏ పార్టీలో చేరతానన్న విషయం త్వరలో వెల్లడిస్తానన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu