కాంగ్రెస్ నేతని వాటర్ బాటిల్‌తో కొట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
posted on Aug 7, 2025 2:48PM

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్ధానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్యామ్ నాయక్ తనను అవమానించారంటూ వాటర్ బాటిళ్లతో ఆయనపైకి విసిరింది ఎమ్మెల్యే. దీంతో ఆయనపైకి వాటర్ బాటిల్ బలంగా విసరడంతో శ్యామ్‌కు దెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
అయితే, పలు చోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఇక్కడే కాదు.. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోతుంది. ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం రచ్చ రేపుతోంది. మొన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా తీవ్ర ఘర్షణ జరిగింది.