కిషన్ రెడ్డికి దమ్ముంటే జూబ్లీలో డిపాజిట్ తెచ్చుకోవాలి : సీఎం రేవంత్‌

 

జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్‌మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.షేక్ పేట డివిజన్ పారా మౌంట్ కాలనీలో ముఖ్యమంత్రి ప్రచార సభ నిర్వహించారు. కిషన్ రెడ్డి..ఎందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వొద్దు? నీ అబ్బ జాగీరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే నీకు ఏం ఇబ్బందని రేవంత్ అన్నారు. రెహమత్ నగర్ లో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించిందని స్ఫష్టం చేశారు. 

కాంగ్రెస్ అంటే ముస్లిం..ముస్లిం అంటే కాంగ్రెస్ అని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో  నేను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఎంతో ఉందని సీఎం అన్నారు. ప్రధాని మోదీ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కటే అని కేసీఆర్ ప్రతి సారి కేంద్రంలో మోదీకి మద్దతు ఇచ్చాడని రేవంత్ అన్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని..బీఆర్ ఎస్ ముస్లిం లను మోసం చేస్తుందని పేర్కొన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ పైన సీబీఐ విచారణ అడిగితే మోదీ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్ రేస్ కేసు లో కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అనుమతించడం లేదని తెలిపారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే జూబ్లీ హిల్స్ లో డిపాజిట్  తెచ్చుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. జూబ్లీ హిల్స్ గ్రౌండ్ లో అసలు బీజేపీనే లేదని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu