మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్

 

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆయన కోడలు ప్రీతి రెడ్డి, కొడుకు భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇంజనీరింగ్,మెడికల్ కళాశాలల సీట్ల కేటాయింపులో భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం.

మేనేజ్‌మెంట్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మించి విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందినట్టు సమాచారం.విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో వచ్చిన ఆదాయాన్ని సరిగా చూపకపోవడం.. ఆదాయ పన్నులో హెచ్చుతగ్గులను గుర్తించడం వంటి అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి ఫ్యామిలీ సంబంధించి పలు ప్రాపర్టీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 

మరోవైపు ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఏమన్నారంటే. ఐటీ అధికారులు ఇళ్లపై రైట్స్ చేస్తున్న విషయంలో నిజం లేదని తెలిపారు. 2022లో పీజీ సీట్ల విషయంలో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఇక్కడకి వచ్చారని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు అందజేశారని అన్నారు. ఉదయం 6 గంటలకు అధికారులు రావడంతో ఐటీ అధికారులుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఇందులో వాస్తవం లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేర్కొన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu