కేటీఆర్, హరీష్ రావు హౌస్ అరెస్టు

హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ సీటీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ గురువారం (అక్టోబర్ 9) చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు సిటీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను పోలీసులు నిలువరిస్తున్నారు.

కాగా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  కోకాపేట‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులను మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.హరీష్ రావు మెహదీపట్నం బస్టాప్ నుంచి, కేటీఆర్ రేతిఫైల్ బస్టాప్ నుంచి బస్ భవన్ కు చేరుకోవాల్సి ఉండగా పోలీసులు వారిని వారి వారి ఇళ్లల్లోంది బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu