మున్సిపల్‌ ఎన్నికల్లో వివాదం...సిరాకు బదులు మార్కర్ పెన్నులు!

 

మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓటింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్ల చేతివేలిపై గుర్తులు పెట్టేందుకు సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాన్ని బృహన్ముంబయి మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రాని కూడా అంగీకరించారని విపక్షాలు పేర్కొంటున్నాయి.

మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు  ఓటర్లకు డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకైనా పాల్పడేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు. 

వ్యవస్ధను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికి ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.అయితే, ఈ ఆరోపణలను బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఖండించింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగిస్తున్నారన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu