సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి దగ్గుబాటి భేటీ

మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుకు తోడల్లుడన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసిన డాక్టర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

సుదీర్ఘ కాలం తరువాత ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు డాక్టర్ దగ్గుబాటి  చంద్రబాబు నివాసానికి వెళ్లారు.  మార్చి 6న విశాఖ పట్నంలోని గీతం వర్సిటీ ఆడిటోరి యంలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబుును ఆహ్వానించారు. ఈ పుస్తకావిష్కరణకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరు కానున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu