చిరుతను బంధించిన అటవీ అధికారులు

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు.  గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ఇటీవల   చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇదే చిరుత  గత కొద్దిరోజులుగా మృగవని పార్క్, గ్రే హౌండ్స్, గోల్కోండ ప్రాంతాల్లో  సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దానిని బంధించేందుకు  14 ట్రాప్ కెమెరాలు,  మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత మంచిరేవులలోని ట్రెక్ పార్క్ లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు గురువారం ఉదయం అక్కడ అమర్చిన బోనులో బంధించారు.  అందరినీ హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు పట్టుబడడంతో అధికారులతో పాటు జనం ఊపిరి పీల్చుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu