నడిరోడ్డుపై లారీలో మంటలు.. పేలిన గ్యాస్ సిలెండర్లు
posted on Aug 6, 2025 4:46PM

మంగళగిరిలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక లారీ దగ్ధమై అందులో ఉన్న గ్యాస్ సిలెండర్లు పేలిన ఘటన స్థానికంగా ప్రజలలో తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఈ ఘటన మంగళగిరి ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం (ఆగస్టు 6) చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీలో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి.
ఆ లారీలో ఉన్న మూడు గ్యాస్ సిలెండర్లు భారీ శబ్డంతో పేలిపోయాయి. లారీ చూస్తుండగానూ పూర్తిగా దగ్ధమైంది. లారీ దగ్ధం కావడం, ఆ లారీలోని గ్యాస్ సిలెండర్లు పెద్ద శబ్బంతో పేలిపోవడంపై ఆ ప్రాంత ప్రజలు, జాతీయ రహదారిపై వెడుతున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్ట వశాత్తూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.