బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు : సీఎం రేవంత్

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. మన పోటీ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, టీబీజేపీ చీఫ్ రామచందర్‌రావుతో కాదు. నరేంద్ర మోదీ భారత ప్రభుత్వంపైనే.. ప్రధానికి సవాల్ విసురుతున్నాం  మా బీసీ రిజర్వేషన్ల డిమాండ్ ఆమోదించకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసి రిజర్వేషన్లు సాధించేవరకు నిద్రపోమని సీఎం తెలిపారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతిని అపాయింట్‌మెంట్‌ అడిగాం.. కానీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తరహాలో దేశంలోనూ జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని మోదీ, అమిత్‌షా చెప్పి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu