పెన్సిల్ కోసం పిల్లల తగవు.. నిండు ప్రాణం బలి!

ఒక పెన్సిల్ కోసం ఇద్దరు పిల్లల ఘర్షణ పెద్ద వాళ్ల జోక్యంతో పెద్ద గొడవగా మారి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా శెట్లూరు పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  అనంతపురం జిల్లా శెట్టూరు లోని ఎర్రిస్వామి, మరియమ్మ దంపతుల కుమారుడు క్రిష్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగలి చదువుతున్నాడు. అదే పాఠశాలలో అదే తరగతి చదువుతున్న  అదే గ్రామానికి చెందిన  ప్రకాష్, ప్రమీల దంపతుల కుమారుడు గగన్ తో పెన్సిల్ విషయంలో గొడవపడ్డాడు.  

పిల్లల తగవే కదాని వదిలేయకుండా  క్రిష్ తల్లిదండ్రలు బంధువులతో కలిసి గగన్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. గగన్ ఇంటికి వెళ్లి మరీ కొట్టారు. ఈ దాడిలో గగన్ తండ్రి  ప్రకాష్ (37) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రకాష్ మృత్యువాత పడ్డారు. ప్రకాష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన  ఎర్రిస్వామి సహా ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu