మలబద్ధకము
posted on Mar 25, 2019 11:19AM

ఆకలి వేస్తే తినడానికి ఎంత ఉవ్విళ్ళూరుతామో.... తిన్నది అరిగి బయటపడకపోతే అంత అల్లాడిపోతాము. మనం తిన్నది... జీర్ణం కాక... శుష్కించి వుండలు గట్టి మలమార్గం నుండి సునాయాసంగా బయటకు రాకుండా ఉంటే దాన్ని అనాహము మలబద్ధకము అంటారు. నడుము, వీపు యందు పట్టుకొని నట్లు ఉండటం వలన కడుపునొప్పి, ఆయాసం, వాంతి లాంటివి మలపవ్రుత్తి జరగకపోతే వస్తాయి. దప్పిక జలుబు, శిరస్సునందు మంట, కడుపునొప్పి రొమ్ము పట్టినట్టు ఉండటం, త్రేనుపులు పైకి రాకుండటం వంటి లక్షణాలు కొందరిలో ఇలా కనబడతాయి.
ముందుజాగ్రత్తలు: ఇలా వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఏమిటంటే.....లేతముల్లంగి, మునగ ఆకులు, మునగకాయ, కాకరకాయ, పొన్నగంటికూర, ద్రాక్ష, వెల్లుల్లి, ఆవుపాలు, ఆముదము, లవల కట్టు ఏడాది దాటిన బియ్యం హితకరములు వగరు రుచిగల పదార్ధాలు, కషాయరసము గలవి మలబద్ధకము గల వారు విసర్జించాలి.
మందుజాగ్రత్తలు: హింగుత్రిగుణ తైలం రెండుచెంచాలు తీసుకొని పాలలో కలిపి సేవిస్తే గుణకారిగా ఉంటుంది. రాత్రిపూట త్రిఫలా చూర్ణం, ఒకటి రెండు చెంచాలు వేడి నీటిలో సేవించాలి. అభయారిష్ట లేదా ద్రాక్షారిష్ట కొద్దిరోజులు సేవించాలి. అపత్తిక చూర్ణం ఒకటిరెండు చెంచాలు సేవిస్తే బావుంటుంది.