తమిళనాడు బంద్...స్టాలిన్ అరెస్ట్
posted on Apr 25, 2017 11:52AM

గత కొద్ది రోజులుగా చెన్నై రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలని.. రైతు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోజుకో వేషంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులకు మద్దతుగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించింది. డీఎంకే నేతృత్వంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం వెంటనే కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటుచేయాలని, కావేరీ డెల్టా ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశాయి.