నా కొడుకు ఐదుగురిని చంపాడు... గర్వంగా ఉంది...
posted on Apr 25, 2017 12:27PM
.jpg)
నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో దాదాపు 25 మంది జవాన్లు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై ఓ జవాను తల్లి స్పందిస్తూ తన కొడుకు చేసిన పనికి గర్వపడుతున్నానంది. ఆ సమయంలో తన కొడుకు, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ షేర్ మహ్మద్ ఐదుగురు మావోయిస్టులను చంపి తీవ్రంగా గాయపడ్డాడని అతడి తల్లి ఫరీదా తెలిపారు. అందుకు తనకు గర్వంగా ఉందని అన్నారు. అయితే ఇప్పుడు అతని క్షేమం కోసం గ్రామం అంతా ప్రార్థనలు చేస్తోందని ఆమె అన్నారు. కాగా మధ్యాహ్నం భోజనాలు చేయడానికని ఆయుధాలు పక్కన పెట్టి.. ముద్ద నోట్లో పెట్టుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా విరుచుకుపడిన మావోయిస్టులు గుట్టల పైనుంచి కాల్పులు జరిపి 25 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.