కుటుంబ‌పాల‌న‌ను త‌రిమికొట్టాలి.. రాజ‌గోపాల్‌రెడ్డి పిలుపు

తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచి పోయే తీర్పు ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు.  త‌న రాజీనామా త‌ర్వాత‌నే సీఎం కేసీఆర్ ఫామ్‌ హౌస్‌నుంచి మునుగోడుకి వ‌చ్చార‌ని, త్వ‌ర‌లోనే కేసీఆర్‌, కేటీఆర్ స్కామ్‌లూ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని మాజీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.  ఆయ‌న శ‌నివారం (ఆగ‌ష్టు 27) మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షా రాక‌తోనే ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ లిక్క‌ర్ బాగోతం బ‌య‌ట‌ప‌డింద‌ని అన్నారు.

మునుగోడు ఉపఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే ప్ర‌చారాన్ని త‌ల‌పించేఆ బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశా లు, చేరిక‌ల్లో పార్టీలు త‌ల‌మున‌క‌లు కావ‌డం గ‌మ‌నిస్తున్నాం. మోవంక అధికారులు మునుగోడు ఉప ఎన్నిక కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌షెడ్యూల్‌ను ప్ర‌క‌టించేలోగా ఈవీఎంలను సిద్ధం చేస్తు న్నారు.

జిల్లాలో ఈవీఎంల కొరత ఉండగా, ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు యాదాద్రి జిల్లా నుంచి వాటిని తీసుకోనున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైందన్న‌ది తెలిసిందే.  ఆయన రాజీనామాతో ప్రధాన పార్టీలు భారీ సభల తో తొలి దశ ప్రచారానికి తెర లేపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu