రామగుండం ఎరువుల పరిశ్రమపై కేసీఆర్‌కు రేవంత్ లేఖాస్త్రం
posted on Aug 27, 2022 4:51PM
తెలంగాణాలో ఎరువుల పరిశ్రమలో చోటు చేసుకుంటున్న అవకతవకలు, అవినీతి పట్ల టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రామగుండం పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలు జరిగా యని ఆయన తెలంగాణా సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో తెలియజేశారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ కలిసి దాదాపు 800 మంది నిరుద్యోగుల నుంచి రూ. 6 లక్షల నుంచి రూ.15 లక్షలవరకు వసూలుచేసి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారని లేఖలో తెలిపారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని..అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని బాధితులకు నమ్మబలికారన్నారు. ఉద్యోగాల నియామకంలో దాదాపు రూ. 50 కోట్లు చేతులు మారాయని సీఎం కేసీ ఆర్ కు రాసిన లేఖలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఈనేపథ్యంలోనే ఇటీవల రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిందని..వారు గతంలో నియ మించిన వారిలో సగం మందిని తొలగించారని పేర్కొన్నారు. ఇప్పుడు బాధితులంతా ఆందోళనలు, ఉద్య మాలు చేస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే తీవ్రంగా మానసిక ఆందోళన గురై కేశవపట్నం మండలం అమ్మలపురానికి చెందిన హరీష్ అనే యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మ హత్య చేసుకు న్నాడని లేఖలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు రేవంత్‌రెడ్డి.