మాజీ ముఖ్యమంత్రి కాన్యాయ్ పై దాడి.. కారుకు నిప్పు

 

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కాన్యాయ్ పై గుర్తు తెలియని దుండగలు దాడి చేశారు. ఈ ఘటన బీహార్ లోని దుమారియాలో జరిగింది. అటుగా వెళ్తున్న మాంఝీ కాన్వాయ్ పై దుండగలు రాళ్లతో దాడి చేసి.. ఆపై ఓ కారుకు నిప్పు కూడా పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దాడి ఎవరు చేశారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

 

కాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఒకప్పుడు బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు అనుచరుడిగా ఉండేవాడు. అతని సహకారంతోనే.. ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అయితే సీఎం అయిన తరువాత నితీశ్ కు వ్యతిరేకంగా మారిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాంఝీ సొంత కూటమి పెట్టుకుని బీజేపీ మద్దతుతో పోటీ చేసినా కనీసం తాను ఒక్కరు కూడా గెలవలేకపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu