రైల్లో బెర్త్ దొరకలేదా.. అయితే విమానంలో వెళ్లొచ్చు..
posted on May 26, 2016 12:54PM

ఇప్పటికే రైలు టికెట్లు రద్దు.. బుకింగ్ విషయంలో పలు కీలక మార్పులు చేసిన రైల్వేశాఖ ఇప్పుడు మరో శుభవార్తను రైలు ప్రయాణీకుల ముందుకు తీసుకొచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకొని.. ఒక వేళ బెర్త్ దొరకని నేపథ్యంలో.. సదరు ప్రయాణికులు విమానంలో ప్రయాణించే అవకాశం దక్కింది. ఈ రకమైన ఒప్పందం ఎయిర్ ఇండియా, ఐఆర్సీసీటీల మధ్య కుదిరింది. రైలులో బెర్త్ దొరకని వ్యక్తులు విమానంలో ప్రయాణించవచ్చు.. అయితే దానికి ఇంకొంచం ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. రైలులో మొదటి తరగతి ప్రయాణీకులు విమాన యానానికి ఏమీ అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎసి-2 టైర్ ప్రయాణీకులు మాత్రం 2 వేల రూపాయిలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానున్నది.